గ్లోబల్ వైడ్ గా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త మార్గంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. నిపుణులు ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ హ్యకర్లు కొత్త ఎత్తులతో హ్యాకింగ్ చేస్తున్నారు. తాజాగా చార్జింగ్ కేబుల్‌తో కూడా మన డాటాను ఖాళీ చేయొచ్చంటూ ఓ హ్యాకర్ నిరూపించాడు.చెప్పడమే కాక స్వయంగా నిరూపించాడు కూడా. ఆపిల్ యూఎస్బీ కేబుల్‌తో ఇలాంటి ప్రమాదం ఉందని హెచ్చరించాడు.
ఓఎంజీ కేబుల్‌గా పిలవబడే ఆపిల్ యూఎస్బీ లైటెనింగ్ కేబుల్ సాధారణ చార్జింగ్ కేబుల్‌లానే కనిపించిన్నప్పటికీ దాంతో..ఒక్కసారి ఈ కేబుల్‌ని మీ డివైజ్‌కు కనెక్ట్ చేశారనుకోండి..అది వెంటనే వైఫై రేంజ్లో మీకు తెలియకుండానే మీ డివైస్‌లోని హానికరమైన పేలోడ్స్‌ని వైర్‌లెస్‌గా పంపించగలుగుతాయని సదరు హ్యాకర్ వివరించారు. ఈ చార్జింగ్ కేబుల్‌లో ఉండే కమాండ్స్, స్కిప్ట్స్, పేలోడ్స్‌ను ఉపయోగిస్తూ హ్యాకర్ మీ వ్యక్తిగత డాటాను చోరీ చేస్తాడని తెలిపారు.
ఒకసారి ఈ కేబుల్‌ను మీ సిస్టంకు కనెక్ట్ చేశారంటే అటాకర్ ఆటోమెటిక్‌గా మీ కంప్యూటర్ను లాగాఫ్ చేయడం ఆ తర్వాత మీరు ఎంటర్ చేసే పాస్ వర్డ్‌ను కూడా తెలుసుకునే అవకాశం ఉందంటున్నాడు. అయితే, సదరు హ్యాకర్ చేస్తున్న ఆరోపణలపై ఆపిల్ సంస్థ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
సైబరà±â€Œ నేరాలౠసైబరà±â€Œ నేరగాళà±à°²à± à°¹à±à°¯à°¾à°•à°°à±â€Œ ఆపిలౠయూఎసà±â€Œà°¬à±€ కేబà±à°²à±â€Œ ఛారà±à°œà°¿à°‚గౠకేబà±à°²à± à°•à°‚à°ªà±à°¯à±‚à°Ÿà°°à±â€Œ